అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అదివారం మధ్యాహ్నం లంగర్‌హౌస్ చౌరస్తాలో అమ్మవారి తొట్టెల, పలహారం బండికి మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రులు తలసాని, పద్మారావు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, కల్టు సాక సమర్పించారు. బోనాల ఊరేగింపు లంగర్‌హౌస్ చెరువు కట్ట, ఫతేదర్వాజా మీదుగా సాగింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, బీజీపీ శాసనసభపక్షనేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ అమ్మవారికి పూజలు చేశారు. బోనాలకు ఈ ఏడాది రూ.15 కోట్లు కేటాయించినట్లు మంత్రులు తెలిపారు.













