గోల్కొండ కోటపై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఈ నెల 15 జరిగే భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సీఎస్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ పతకాన్ని ఎగురవేస్తారని తెలిపారు. ఈ వేడుకలకు పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను నియంత్రించాలన్నారు. ఈ ఉత్సవాలకు అవసరమైన సదుపాయాలను రోడ్డు, భవనాల శాఖ పర్యవేక్షించాలని తెలిపారు. ఆరోగ్య శాఖ తరపున ఉత్సవాలకు తరలి వచ్చే వారికి మాస్క్‌లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఇక సాంస్కృతిక శాఖ వేడుకల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుందని తెలిపారు.













