ఐటీ హబ్ ను సందర్శించిన గ్లోబల్ ప్రతినిధులు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రతినిధులు నిజామాబాద్ నగరంలోని ఐటీ హబ్‌ను సందర్శించారు. ఎమ్మెల్సీ కవిత ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని కోరిన మేరకు ఆ సంస్థ ప్రతినిధులు కృష్ణ, సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ సెల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాలతో కలిసి ఐటీ హబ్‌ను పరిశీలించారు. ఐటీ హబ్‌లోని సదుపాయాలను మహేశ్ బిగాల వారికి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో గ్లోబల్ లాజిక్ సంస్థ విస్తరించి కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని ఆయన తెలిపారు. దేశంలో మొత్తంలో 30 వేల మంది ఈ సంస్థలో పని చేస్తుండగా ఒక్క హైదరాబాద్‌లో 3 వేల మంది పని చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.













