మోదీ, ఇవాంక వెళ్లేది శంషాబాద్ నుంచే
ప్రధాని నరేంద్ర మోదీ, ఇవాంకలు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచే తిరిగి వెళతారని డీజీపీ చెప్పారు. 28న తెల్లవారుజామున ఇవాంక శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారని, అక్కడి నుంచి వెస్టిన్ హోటల్‌కు, ఆ తర్వాత హెచ్ఐసీసీలోని జీఈఎస్ ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు. ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి వస్తారని, అక్కడి నుంచి హెలికాప్టర్లో మియాపూర్‌కు చేరుకుని, మెట్రో రైల్‌ను ప్రారంభించి కూకట్పల్లి వరకు ప్రయాణిస్తారని డీజీపీ వెల్లడించారు. అదే రైల్లో మళ్లీ మియాపూర్‌కు చేరుకుని హెలికాప్టర్లో హెచ్ఐసీసీకి వెళ్తారన్నారు. 28 రాత్రి మోదీ శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళతారని, ఇవాంక మరుసటి రోజు శంషాబాద్ నుంచి అమెరికా వెళతారని తెలిపారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులు విడిది చేయనున్న 21 హోటళ్లపై నిఘా ఉంచామన్నారు. జీఈఎస్ సజావుగా జరగడానికి ప్రజలు సహకరించాలని కోరారు.













