దైవస్తోత్రాలకు నాట్యరూపం ఇస్తున్న… కృష్ణసాహితి ప్రతిభ అద్వితీయం, అమోఘం
చిరుప్రాయంలోనే సంగీతం, నాట్యంపై మక్కువతో విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగి నేడు వినూత్నంగా కూచిపూడి నృత్యంలో వివిధ అంశాలపై సొంతంగా కొరియోగ్రఫీ చేస్తూ ఎంతోమందిని డాక్టర్ ఎం.వి. కృష్ణసాహితీ ఆకట్టుకుంటోంది. ఓవైపు నృత్యం, మరోవైపు పాటలు తానే పాడుతూ, కొరియోగ్రఫీ చేస్తూ బహుముఖ ప్రతిభను ప్రదర్శిస్తోంది. సంస్కృతంపై ఉన్న పట్టుతో శ్లోకాలకు నృత్య ప్రతిభను జోడించి అందరిచేత శెభాష్ అనిపించుకుంటోంది. ఎన్నో రికార్డులు, సన్మానాలతోపాటు డాక్టరేట్‌ను కూడా కృష్ణ సాహితీ అందుకుంది.
హైదరాబాద్‌కు సమీపంలో గాజులరామారంలో ఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన కురపతి మాలతీలత, ఎం.వి. సత్యనారాయణ దంపతుల కుమార్తె కృష్ణ సాహితి. చిన్న వయస్సులోనే నృత్యంపై పట్టును సంపాదించి, అనతికాలంలోనే కూచిపూడి నృత్యంలో డాక్టర్ పట్టాను కూడా అందుకుంది. గురువు సువర్చల మరణం తరువాత సొంతంగా కొరియోగ్రఫీ చేయడం ప్రారంభించింది. భద్రాచలంలో ఆదిపురుష స్తోత్రానికి ఆమెకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. సంస్కృతంలో కూడా పాటలు రాయడంలో ప్రతిభను కలిగిన కష్ణ సాహితి ఆ స్తోత్రాలకు తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేసి తన నృత్యంతో అందరినీ అలరిస్తోంది. శ్రీసూక్తం, రంజని మాలకృతి, భద్రకాళి దండకం, నవదుర్గాస్తోత్రం, మృత్యుంజయ మంత్రం, ఆదిశక్తిమాత, నాట్యారంభం (అర్థనారీశ్వరం), ఆదిపురుష స్తోత్రం, నమకం, ఓం నమశ్శివాయ వంటి స్తోత్రాలకు సొంతంగా కొరియోగ్రఫీ చేసింది. దసర స్పెషల్‌గా నవ దుర్గావతారాలు, శైలజపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అమ్మవార్ల రూపాలతో దసరా సమయంలో ఒక్కోరోజు ఒక్కో అమ్మవారిని కీర్తిస్తూ తన నృత్యాలతో అందరినీ పరవశింపజేసింది. శివ అన్వేషణ పేరుతో ఓ డాక్యుమెంటరీని కూడా ఆమె రూపొందించింది. ఆమెకు పురాణాల మీద ఉన్న ఆసక్తితో ఇలాంటి కార్యక్రమాలను ఆమె చేసింది. ఋగ్వేదం నుంచి శ్రీ సూక్తంలో సొంతంగా చేసిన కొరియోగ్రఫికిగాను హైరేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకుంది. బెంగళూరులోని రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్‌లో గౌరవ డాక్టరేట్‌ను ఆమె అందుకుంది.
ఇటీవల లలిత సహస్రనామం, వేదం మీద కూచిపూడిలో ఆమె చేసిన కొరియోగ్రఫీకిగాను వండర్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొని సాహితీ ప్రతిభను కొనియాడారు.
ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలను అందుకున్న కృష్ణసాహితీ ప్రతిభ విశ్వవ్యాప్తి కావాలని తెలుగు టైమ్స్ ఆశిస్తోంది. అమెరికా లో ప్రాంతీయ లేదా జాతీయ తెలుగు సంఘాలు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా కూడా ఇదివరలో కుదరని కళా రూపాలను ఆవిష్కరించి ప్రోత్సహించటం జరుగుతోంది. అలాంటి వారికి డా. కృష్ణ సాహితీ ప్రదర్శన చాలా వైవిధ్య భరితంగా ను, మిక్కిలి ఆకర్షణీయం గాను ఉంటుందని శ్రీ సుబ్బారావు చెన్నూరి తెలుగు టైమ్స్ ఎడిటర్ అభిప్రాయ పడుతున్నారు.
ఎంతోమంది ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న అమెరికా తెలుగుసంఘాలు కృష్ణ సాహితీ ప్రతిభను గుర్తించి ఆమెకు ఓ ఛాన్స్ ఇవ్వాలని తెలుగు టైమ్స్ ద్వారా కోరుకొంటున్నారు.
ఇతర వివరాలకు ఈ లింక్‌లను చూడండి.
Youtube Channel:– Dr. Krishna Sahithi
https://www.youtube.com/channel/UCMvLXioZhJAhW7X_zBddA-g
Instaram :-
https://www.instagram.com/dancer_dr.krishna/
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు
Phone : Res 9912458098 Off 7997205301
E-mail ID : sahivanam@gmail.com













