మేయర్ విజయలక్ష్మి మరోసారి .. వివాదస్పద వ్యాఖ్యలు
ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ తాజాగా మరోసారి కుక్క కాట్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరినో కుక్క కరిస్తే, కుక్కను నేనే కరవమన్నట్టు చేశారు అంటూ మండిపడ్డారు. కావాలనే తనపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో మహిళల గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేరు తట్టుకోలేరన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారన్నారు. మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్ మేయర్గా పనిచేయడం అంత సులువు కాదని అన్నారు.













