జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం…వారికి మాత్రమే ప్రవేశం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే బల్దియా కార్యాలయాల్లో ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని తెలిపింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇదిలా వుండగా ఎల్ బి నగర్ జోన్ •ల్దియా కార్యాలయంతో పాటు సర్కిల్ కార్యాలయాల ఎదుట కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే లోనికి అనుమతి అంటూ ఫెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీ లోగా బల్దియా ఉద్యోగులు, సిబ్బంది అందరూ వ్యాక్సిన్ చేయించుకోవాలని, కార్యాలయంలో పనులు కోసం వచ్చే పౌరులు కూడా వ్యాక్సిన్ చేయించుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.













