జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తాం – పార్థసారధి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో వెలువరిస్తామని, నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ప్రకటించారు. ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని బుధవారం నాడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరిపేందుకు వీలుగా ఎన్నికల పక్రియను ప్రారంభించినట్లు చెప్పారు. కొవిడ్-19 నేపథ్యంలోబ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.













