తెలంగాణలో జెనిసిస్ విస్తరణ
మధుమేహుల కోసం ఇన్సులిన్ ఉత్పత్తి చేసే జెనిసిస్ బయాలజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విస్తరణ ప్రణాళికలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో 50 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టిన ఆ సంస్థ మరో 50 నుంచి 60 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడితో రీ కాంబినెంట్ బల్క్ మాన్యుఫాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో ఇన్సులిన్ ధరలు అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా తెలంగాణ పెట్టుబడి పెట్టేందుకు, విస్తరణకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. తాజాగా జరిగిన పలు సమావేశాల్లో కొన్ని కీలక ప్రకటనలు వెలువడ్డాయి. మంత్రి కేటీఆర్ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.













