టీఆర్ఎస్ తలుచుకుంటే మీరు ఫ్లైట్ దిగేవారా? : గంగుల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాటంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు భయం అంటే ఏంటో చూపించేవాళ్లమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై శివరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండిరచారు. సీఎం కేసీఆర్ తలుచుకుంటే చౌహన్ ఫ్లైట్ దిగే వాడివా? అని ప్రశ్నించారు. తెలంగాణ అతిథివి కాబట్టే సేఫ్‌గా వెళ్లావ్ అన్నారు. బీజేపీకి కలలో కేసీఆర్ వచ్చాడని, కాబట్టే వరసుగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్‌కు క్యూ కట్టారన్నారు. భయం మీకా? కేసీఆర్ కా? అని ప్రశ్నించారు.
చౌహన్ పాలన సరిగ్గా లేక మధ్యప్రదేశ్ ప్రజలు హైదరాబాద్‌కు వలస వస్తున్నారన్నారు. మళ్లీ తెaలంగాణకు చౌహన్ వస్తే వలస కార్మికులే అడ్డుకుంటారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో పరిపాలన సక్కగుంటే మధ్యప్రదేశ్‌లో పండిన పంట ఎంత? తెలంగాణ పంట ఎంత? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అంటే బీమారి రాష్ట్రం అంటారని, పరిపాలనలో అట్టర్ ఫ్లాప్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ అని విమర్శించారు.













