మూడో ఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు
సీఎం కేసీఆర్ బొమ్మ, టీఆర్ఎస్ జెండాతోనే హుజూరాబాద్ లో గెలువబోతున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సామాన్యులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. రైతుబందు, రైతుబీమా, ఇరవై నాలుగు గంటల కరెంటు, కళ్యాణలక్ష్మి, ఆసరా ఫించన్లు, దళితబంధు ఇలా వందల సంఖ్యలో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. మోటర్లకు మీటర్లు పెడుతామంటూ వ్యవసాయ నల్లచట్టాల్ని తీసుకొచ్చిన బీజేపీకి ఓటేయద్దని విజ్ఞప్తి చేసారు. బీజేపీ ప్రభత్వం పెట్రోల్, డీజిల్ ధరల్ని రోజు రోజుకు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. రాష్ట్రంలో రాజాసింగ్, రఘునందన్ రెండు ఆర్లు గెలిపించే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు మూడో ఆర్ రాజేందర్‌ను అసెంబ్లీ పంపే అకాశమే లేదన్నారు.













