అంతర్జాతీయ ఎక్స్పోలో గంగపటం
ఢిల్లీలో ఈ నెల 18 నుంచి 20 వరకు జరగనున్న అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పోలో ఖమ్మం జిల్లాకు చెందిన 85 ఏళ్ల నాటి గంగపటం ప్రదర్శించనున్నారు. భారీ వస్త్రంపై బండారు కలంకారీ కళాకారులు గంగపటం వేశారు. ఈ వస్త్రంపై 12వ శతాబ్దానికి చెందిన యాదవ వీరుడు కాటమరాజు కథను పొందుపరిచారు. యాదవ చరిత్ర, కాటమరాజు చరిత్ర, పౌరాణిక ఘట్టాల చిత్రాలతో వేసిన ఈ పటంలో గంగమ్మ ప్రధాన పాత్రగా ఉంటుంది. ఈ పటాల్లోని బొమ్మలక్రమం ఆధారంగా కథాగానం చేసేవారని, తిత్తివాద్యం వాయిస్తూ కాటమరాజు చరిత్రను కథాగానం చేసేవారని ఆద్యకళా మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు తెలిపారు.













