మరో ఘనతను సాధించిన గాంధీ ఆసుపత్రి.. దక్షిణాదిలో ఇదే తొలి
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి మరో ఘనతను సాధించింది. ఐసీఎంఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసర్చ్ (డీహెచ్ఆర్) అభివృద్ధి చేస్తున్న ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్ వర్క్ (ఐఎన్‌టీఈఎన్‌టీ)కి గాంధీ ఆసుపత్రిని ఎంపిక చేశారు. దక్షిణ భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి ఆసుపత్రి ఇదే కావడం గమనార్హం. కరోనా వైరస్‌కు కూడా తొలుత గాంధీ ఆసుపత్రిలోనే వైద్య సేవలు ప్రారంభం కావడం గమనించాల్సిన విషయం. దక్షిణాది రాష్ట్రాలకు గాను రీజినల్ క్లినికల్ ట్రయల్స్ యూనిట్‌గా గాంధీ ఆసుప్రతి ఎంపికై సరికొత్త చరిత్రను సృష్టించింది.













