కాంగ్రెస్ కాంపౌండ్ లోకి బీఆర్ఎస్ కీలక నేత.. షాక్ లో కెసిఆర్..

తెలంగాణలో ఎన్నికలు ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కెసిఆర్ పార్టీని కడ తీర్చడమే లక్ష్యం అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. అందుకే ఆ పార్టీ కీలక నేతలపై హస్తం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే దానం నాగేంద్ర తో పాటు ఇంకొంతమంది కీలక నేత్రలు హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చేశారు. అయితే వలసల పర్వం పూర్తి కాలేదని.. ఇంకా హస్తం గూటికి రావాల్సిన కార్లు చాలా ఉన్నాయని సమాచారం. రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ కీలక నేత.. నగర మేయర్ అయిన కె.కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్ని రోజుల క్రితం ఆమె స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొద్దిసేపటి క్రితం విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ తో భేటీ కూడా అయ్యారు. దీంతో ఆమె కాంగ్రెస్ లో చేరడం కన్ఫామ్ అన్న వార్త బలంగా వినిపిస్తోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు మరో షాక్ ఫిక్స్.