గద్దర్ సంచలన ప్రకటన
ప్రజాయుద్ధ నౌక గద్దర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజ్యాధికారం దిశగా వెళ్లాలనిపిస్తోందని, ఎన్నికల్లో పోటీ చేస్తానని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బీఎల్ఎఫ్ సమావేశంలో గద్దర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. లాల్ నీల్ జెండాలతో నూతన పార్లమెంట్ తీసుకురావాల్సి ఉందన్నారు. అంబేద్కర్ విధానం పేరుతో ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని విమర్శించారు. లాల్నీల్ ఐక్యతతోనే బహుజన రాజ్యాధికారం సాధ్యమన్నారు. దేశం మొత్తం లాల్నీల్ ఐక్యతపై చర్చ జరుగుతోందని, లాల్నీల్ ఐక్యత చూస్తే తనకు ఎన్నికల్లో పోటీ చేయాలనిపిస్తోందన్నారు. తనకు ఇప్పటి వరకు ఓటు హక్కు లేదని, ఇప్పుడు నమోదు చేసుకుంటానని వ్యాఖ్యానించారు.













