బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో అమిత్ షా, బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కాషాయ కండువా కప్పి, పార్టీలోకి సాదరణంగా ఆహ్వానించారు. కాగా తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడైన కొండా విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎస్ తరపున 16వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తునప్పుడు యూఎస్ పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు 2014, 2018 తెలంగాణ ఎన్నికల టైంలో అఫిడవిట్ ఆధారంగా రిచ్చెస్ట్ పొలిటీషియన్‌గా నిలిచారు కూడా. 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. 2018లో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిందట ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కొండాను అభినందించారు.













