యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంరతం బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసానికి ఆయన వెళ్లారు. ఈ నెల 7న ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జారిపడటంతో కేసీఆర్ ఎడమ తుంటి భాగంలో తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆస్పత్రిలో కోలుకుంటున్న కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు. ఆయన కోలుకోవడంతో నేడు ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు.













