సీఎం కేసీఆర్‌కు మరో అరుదైన గౌరవం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథలో ఆయన చోటు సంపాదించుకున్నారు. ప్రణబ్ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను పొందుపరుస్తూ రాసిన పుస్తకంలో ప్రత్యేక తెలంగాణ ఆశలు, ఆకాంక్షలపై కేసీఆర్ చేసిన పోరాటాలకు రెండు పేజీలు కేటాయించారు. ఎక్కడికి వెళ్ళినా, ఎవ్వరిని కలిసినా రాష్ట్ర సాధనే అజెండాగా మాట్లాడేవారని పేర్కొన్నారు. పదవుల కంటే లక్ష్యసాధనమే ముఖ్యమన్న విషయాన్ని అనేక సందర్భాల్లో నిరూపించారని ఆత్మకథలో రాసుకున్నారు. ప్రలోభాలకు లొంగక పట్టుదలతో లక్ష్యాన్ని చేదించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్న విషయాన్ని సృష్టం చేశారు. నాడు కేంద్ర ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమన్న విషయాన్ని చేతల్లో నిరూపించారని, పదవిని తృణప్రాయంగా భావించి రాజీనామా చేశారని ఆ పుస్తకంలో ప్రస్తావించారు. ది కొలిషన్ ఇయర్స్ పేరుతో ప్రణబ్ రాసిన పుస్తకాన్ని ఇటీవల మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే.













