బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథ్ కు భారీ షాక్

లోక్‌సభ ఎన్నికలు 2024 నామినేషన్ల పరిశీలనలో భాగంగా నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానానికి నామినేషన్ బీఎస్పీ అభ్యర్థికి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ మంద జగన్నాథ్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. పార్టీ బీ-ఫామ్ లేనందున తిరస్కరిస్తున్నట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. దీంతో నాగర్‌కర్నూల్ బరి నుంచి బీఎస్పీ అనూహ్యంగా నిష్క్రమించాల్సి వచ్చింది.