Chintala: దానం పగటి కలలకు ప్రజలే సమాధానం : చింతల
దానం ఎక్కడుంటే అక్కడే గెలుపు అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి (Chintala Ramachandra Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దానం నాగేందర్ రాజకీయ టూరిజం ప్రజలందరికీ తెలుసునని, అధికారం ఎక్కడుంటే దానం అక్కడకు మకాం మార్చుతారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే (MLA)గా గెలిచిన అనంతరం ఎన్నిసార్లు ప్రజల మధ్యకు వచ్చాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ (BRS) గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీ ఒడిలో కూర్చున్న దానం నైతికతపై ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఖైరతాబాద్కు ఉప ఎన్నిక ఖాయమని అందులో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించారని తెలిపారు. అభివృద్ధ్ది పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 300 డివిజన్లలో గెలుపు దానం పగటి కలలకు ప్రజలే సమాధానం చెప్తారని తెలిపారు.






