కమలం గూటికి మోత్కుపల్లి ?
సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు త్వరలో కమలం గూటికి చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి మోత్కుపల్లితో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. బీజేపీలో చేరాలని ఆయన్ను ఆహ్వానించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో అపాయింట్మెంట్ ఉంటుందని బీజేపీ నేతలు వివరించినట్లు సమాచారం. దీంతో బీజేపీలో చేరేందుకు మోత్కుపల్లి అంగీకరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీయేనని మోత్కుపల్లి అన్నారు. మా కార్యకర్తలతో మాట్లాడుతున్నా. బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చాక పార్టీలో చేరుతా అని నర్సింహులు తెలిపారు.













