కాంగ్రెస్ పార్టీకి దానం రాజీనామా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి, టీపీసీసీ ఉత్తమ్ కుమార్లకు తన రాజీనామా లేఖను పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు దానం నాగేందర్ ప్రకటించారు. తదుపరి కార్యాచరణపై రేపు తన అనుచరులతో సమావేశమై నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. దానం గత కొంత కాలంగా పార్టీ కార్య క్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ అడపాదడపా పాల్గొంటున్నా, నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారు.













