సమతామూర్తి కేంద్రానికి మాజీ గవర్నర్ నరసింహన్
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా వేదపండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీరామానుజాచార్యుల స్వర్ణ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన జీయర్‌స్వామి కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామిజీ వారికి మంగళశాసనములు, తీర్థప్రసాదాలు అందజేశారు. శాలువాలు కప్పి సత్కరించారు. జీయర్ ఆశీస్సులు తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని నరసింహన్ వ్యాఖ్యానించినట్లు నిర్వాహకులు తెలిపారు.













