బీఆర్ఎస్ కు షాక్.. కారు దిగిన రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ను వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్లో మానసిక క్షోభకు గురయ్యా. పార్టీలో నాకు సరైన గుర్తింపు లభించడం లేదు. పార్టీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశమే దక్కడం లేదు. కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంది. వారితో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. పార్టీ విధివిధానాలు నచ్చట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామనడం సరికాదు. నేను 15 ఏళ్లు కాంగ్రెస్‌లోనే ఉన్నాను. కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ కోసం పోరాడా అని తెలిపారు.













