ఈ నెల 13న విదేశీ సంపర్క్ సదస్సు
ప్రవాస భారతీయుల సంక్షేమం, రక్షణ అంశాలను చర్చించేందుకు ఈ నెల 13న నగరంలో విదేశీ సంపర్క్ సదస్సు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్ట్‌పోర్ట్ అధికారి డాక్టర్ ఇ.విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్వహించనున్న ఈ సదస్సుకు విదేశీ వ్యవహారాల శాఖ వి.కె.సింగ్. రాష్ట్ర ఐటీ శాఖ, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కె.తారకరామారావు, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, సీనియర్ పోలీసు అధికారులు, 12 జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సులో ఎన్ఆర్ఐలతో సంబంధాలను బలోపేతం చేయడం, భారతీయ దౌత్య కార్యాలయాల ద్వారా సంక్షేమం, రక్షణ చర్యలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.













