తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఇక లేరు
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం చెందారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సాయిచంద్‌ను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సాయిచంద్ మృతదేహాన్ని గుర్రంగూడలోని నివాసానికి కుటుంబ సభ్యులు తరలించారు.













