నీటిలో కలెక్టరేట్ కార్యాలయాలు
తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ కార్యాలయాలు వరద నీటిలో మునిగిపోతున్నాయి. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ భవనం వరదల కారణంగా నీటమునిగింది. తాజాగా నిజామాబాద్ కలెక్టరేట్ భవనంకు కూడా వరద వచ్చింది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనం.. త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అయితే, నిజామాబాద్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తింది. కలెక్టరేట్ లోకి వెళ్లే మార్గం పూర్తిగా జలమయమైంది. మరోవైపు ప్రభుత్వం కూడా వాన ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టింది.













