శాసన మండలిలో ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం
తెలంగాణ శాసన మండలిలో ఆరుగురు సభ్యుల్లో అయిదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. బండా ప్రకాష్ మినహా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రమి రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి చేత మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా రాజ్యసభ సమావేశాల దృష్టా బండా ప్రకాశ్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. అయితే బండా ప్రకాశ్ తన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.













