రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ నేనే తీసుకుంటా
ప్రజల్లో కొవిడ్ వ్యాక్సిన్ పట్ల నమ్మకం పెంచేందుకు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తానే తీసుకుంటానని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదని, బర్డ్‌ఫ్లూ వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని ఆయన అన్నారు. బర్డ్‌ఫ్లూ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగంలోని తొలి, రెండో అంతస్తుల్లో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేక నిర్మాణాలను పూర్తి చేసింది. ఈ నిర్మాణాల ప్రారంభ కార్యాక్రమంలో మంత్రి ఈటల పాల్గొని మాట్లాడారు.
వైద్య ఖర్చులు ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించలేమని అన్నారు. ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ కింద రూ.1,200 కోట్లు. మొత్తం వైద్య రంగంపై రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. నిమ్స్‌లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తూ రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ నెల 11న సీఎంతో జరగనున్న సమావేశంలో వైద్యారోగ్య రంగంపై చర్చించనున్నట్లు తెలిపారు. వైద్యరంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో రెండో దశ డ్రైరన్ విజయవంతమైందని, టీకా ఎప్పుడూ పంపినా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని ఈటల వెల్లడించారు. రోజుకు 10 లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.













