తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ కేడర్లకు చెందిన 1,433 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేసింది. 657 ఏఈఈ, 113ఏఈ సహా ఇతర పోస్టులు భర్తీ చేయనున్నారు. హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎస్వో ఇతర పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు 35,220 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ 80 వేలకు పైగా ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.













