మిస్ ఇండియా పోటీలకు తెలంగాణ యువతుల ఎంపిక
మిస్ ఇండియా పోటీలకు తెలంగాణ నుంచి ముగ్గురిని ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్టె తుది ఆడిషన్స్ సందడిగా జరిగాయి. అమీర్‌పేటలోని బిగ్‌బజార్‌లో నిర్వహించిన ఆడిషన్స్‌లో నగరానికి చెందిన శ్రేయా కామవరపు, స్పటిక సూరపనేని, సిమ్రాన్ చౌదరిలను తెలంగాణ తరపున మిస్ ఇండియా పోటీలకు ఎంపిక చేశారు. ప్రపంచ సుందరి నీలి కిరీటాన్ని మళ్లీ భారత్ ముంగిట ఉంచాలనుకునే వారికి నేహా ధూపియా, పూజా చోప్రా, పూజా హేగ్దే, రకుల్ ప్రీత్‌సింగ్ వంటి వారు శిక్షణ ఇవ్వనున్నారు. ఢిల్లీతో సహా దేశ వ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియలో అర్హత పొందిన వారు భారతదేశం తరపున ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటారు. మే 13న ముంబయిలో అంతిమ పోటీలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.













