ఫామ్‌హౌస్ సినిమాలో పసలేదు : కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శకత్వంలో రూపొందించిన ఫామ్‌హౌస్ ఫైల్స్ సినిమాలో పసలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కథ, స్క్రీన్ ప్లే విఫలమైందని తెలిపారు. పైసలే లేనప్పుడు ఈడీ ఎలా విచారిస్తోందని ఎమ్మెల్యేలనే ప్రశ్నిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్వుల పాలవుతూ, తెలంగాణ పేరును దేశ వ్యాప్తంగా నవ్వులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు రికవరీ చేయలేదో కేసీఆర్ ఇప్పటికీ సమాధానం చెప్పడం లేదని దుయ్యట్టారు. ఎమ్మెల్యేలను వారాలపాటు ప్రగతిభవన్‌లో ఎందుకు బంధించారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేవారు. సిట్ కేసును సీబీఐకి బదిలీ చేయాలనే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కోర్టు తీర్పు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు.













