సీఎం రేవంత్ విదేశీ పర్యటన షెడ్యూల్ ప్రకారమే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని, పర్యటనలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవని తెలంగాణ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. సీఎం రేవంత్ విదేశీ పర్యటనను రద్దు చేసుకొని ఈ నెల 12న తిరిగి రాష్ట్రానికి వస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఈ ప్రచారం సత్యదూరమని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. నకిలీ ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని, ఆకస్మికంగా ముఖ్యమంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో పనిగట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని తెలిపింది. అవాస్తవాలను ప్రచారం చేస్తూ మీడియాను, ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టింది.