బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌కు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్‌తో పాటు పలువురు నేతలు కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల బీఆర్‌ఎస్`బీఎస్పీ పొత్తు పెట్టుకున్న వియం తెలిసిందే. దీంట్లో భాగంగా నాగర్ కర్నూల్ నుంచి ప్రవీణ్ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పొత్తును విరమించుకోవాల్సిన రావడంతో మనస్తాపానికి గురైన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు.