తానా అధ్యక్షులు అంజయ్య చౌదరికి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సత్కారం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు లావు అంజయ్య చౌదరిని పలువురు ఘనంగా సన్మినించారు. అమెరికాలో తానా అధ్యక్షలు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన ఆ హోదాలో హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా అంజయ్య చౌదరి గతంలో విద్య నభ్యసించిన విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్ బళ్లారి పూర్వ విద్యార్థులు ఫిల్మ్నగర్లో క్లబ్లో ఆయనకు ఆత్మీయ సత్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య చౌదరి మాట్లాడుతూ తను తానా టీమ్ స్క్యేర్, తానా ఫౌండేషన్, తానా కేర్స్, తెలుగు భాష అభివృద్ధి చైర్మన్గా 2011 లో తన ప్రస్థానం మొదలై అంచెల అంచెలుగా ఎదుగుతూ వచ్చిన తాను 2021 నాటికి తానా అధ్యక్షునిగా ఎన్నిక కావడం అనందంగా ఉందన్నారు.
గత 2 దశాబ్దాలుగా అమెరికాలో నివాసిస్తూ 200లకు పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఎల్లావేళాల తెలుగు వారి సేవలో నిమగ్నమై అందరిలో ఒకడిగా వెలుగుతూ తానా తరపున భారత్లో పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆత్మీమ సత్కార కార్యక్రమంలో జై శ్రీదేవి హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉప్పల వెంకటేశ్వరరావు, పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులు నల్లమోతు శరత్, కార్యదర్శి కోమలపాటి సుధాకర్ బాబు, కోశాధికారి పాండు రంజగ సజ్జ, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, కందుల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.













