బీఆర్ఎస్ కు షాక్.. కోనేరు కోనప్ప రాజీనామా

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. బీఎస్పీతో పొత్తుతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ఆయన తెలిపారు. ఈ నెల 14న మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కోనప్ప కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తనను సీఎం ఆహ్వానించారని ఆయన తెలిపారు. కోనప్పతో పాటు షాహీన్ సుల్తాన్, పలువురు నేతలు అధికార పార్టీలో చేరనున్నారు.