పీసీసీ రేసులో నేనూ ఉన్నా…

తెలంగాణ రాష్ట్ర (పీసీసీ) అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానని నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ ప్రకటించారు. ఈ నందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలోనే పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఢిల్లీలో మొదలైందని తెలిపారు. పీసీసీ పగ్గాలను బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని కోరుతున్నామని ఆయన అన్నారు. ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి ఈటెల వెళుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‍ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆయన విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే బీజేపీ మీద కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.