టీఆర్ఎస్కు భారీ షాక్
టీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీపై పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్లో అరాచకం పెరిగిపోయిందని ఆరోపించారు. తనపై, అనుచరులపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారని విమర్శించారు. పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అడగకుండానే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. కొందరి వల్లే టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి బాల్క సుమనే కారణమని వ్యాఖ్యానించారు.













