మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, సుధం లక్ష్మి, గద్దల పద్మ, కటారి రేవతిరావు కమిటీలో ఇతర సభ్యులు. కమిషన్ చైర్మన్‌తో పాటు ఆరుగురు సభ్యులూ పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటికి నుంచి ఐదేళ్ల పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 2013లో ఉమ్మడి ఆంధప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా త్రిపురాన వెంకట రత్నం పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2018 మార్చి వరకు ఆమె కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణలో మహిళ కమిషన్‌కు చైర్పర్సన్ నియామకం జరగలేదు. దీంతో సుమారు నాలుగేళ్లుగా కమిషన్ క్రియాశీల కార్యకలాపాలకు దూరంగా ఉంది.













