మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు.. ఇదే చివరి టర్మ్
రాజకీయాల్లో తనకు ఇదే చివరి టర్మ్ అని, 71ఏళ్లు వచ్చాయని ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అయిదేళ్లలో అందరికీ సేవ చేస్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలే తన బంధువులని వ్యాఖ్యానించారు. కాగా, మేడ్చల్ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్న మల్లారెడ్డి రాజకీయ సన్యానం చేస్తానని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.













