మాజీ మంత్రి గీతారెడ్డికి కరోనా పాజిటివ్

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జె.గీతారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‍లో పేర్కొన్నారు. తనతో పాటు తన భర్త రాంచంద్రారెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు గీతారెడ్డి తెలిపారు. హోం ఐసోలేషన్‍లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.