కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా కేసీఆర్ పార్టీని ప్రకటిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో శంకర్‌సింగ్ వాఘేలా ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి పాల్గొన్నారు. ఇటీవల కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా కేసీఆర్ కలిసిన విషయం తెలిసిందే.













