మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఇక లేరు
మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) సోమవారం రాత్రి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉండటంతో ఆయనకు కరోనా పరీక్ష చేయించారు. పాజిటివ్ రావడంతో భద్రాచలం నుంచి విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించారు. సీపీఎంకు చెందిన ఆయన భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014ల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొద్దికాలంగా తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం సున్నంవారి గూడెంలో ఉంటున్నారు. ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడికి కూడా కరోనా సోకింది. వారు రాజమహేంద్రవరం దగ్గర బొమ్మూరులో చికిత్స పొందుతున్నారు.













