బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ?

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియామకం కానున్నట్లు ఆ పార్టీలో విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటల సామావేశం కానున్నారు. అనంతరం ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి మళ్లీ కేంద్ర కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.