ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీలు కొండా విశేశ్వర్వర్రెడ్డి, జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ తీర్పుతో కేసీఆర్కు దిమ్మతిరిగిపోయిందన్నారు. కేసీఆర్కు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని ఆయన మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. తనను ఓడించేందుకు హుజురాబాద్లో రూ.600 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. త్వరలో కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమని అన్నారు.













