రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయకపోతే… కేంద్రం సీబీఐతో
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టకపోతే కేంద్రం సీబీఐతో దర్యాప్తు చేయించి ఘటనకు కారకులను గుర్తిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే యువకులకు అడ్డం పెట్టుకుని విధ్వసం సృష్టించిందనే అనుమాననం కలుగుతోందన్నారు. 17 నుంచి 23 ఏళ్ల యువకు ఉపాధితో పాటు క్రమ శిక్షణ పెంపొందించేందుకే అగ్నిపథ్ అన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్కు వచ్చిన వాళ్ల ముసుగులో రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు చొరబడి విధ్వంసం సృష్టించారు అని మండిపడ్డారు.
రాజ్‌భవన్ ముట్టిడి, సికింద్రాబాద్ ఘటన వెనుక కుట్ర ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. రైల్వే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధం లేదంటూ తప్పించుకుంటుంది. మోదీ ప్రభుత్వం దేశ సంక్షేమం, ప్రజానీకానికి అవసమరయ్యే నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజా క్షేత్రంలో పలుకుబడి లేనివాళ్లే అసహనంతో ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు అని విమర్శించారు.













