టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు.. అదే
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తాము కూల్చాల్సిన అవసరం లేదని, అదే కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు దమ్ముంటే నా హుజూరాబాద్‌లో పోటీ చేయాలి, నన్ను రమ్మంటే గజ్వేల్ వచ్చి కేసీఆర్‌ను కొడతా అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్లో ఎవరు ఉండరని కేసీఆర్‌కు కూడా తెలుసన్నారు. తమ మీటింగులు దగ్గరికి వచ్చే జనాలని తీసుకెళ్లి టీఆర్ఎస్ వాళ్ళు దావత్ ఇస్తున్నారని విమర్శించారు. సర్వేలకు, మీడియాకు అందని రిజల్ట్ మునుగోడులో ఉంటుందని తెలిపారు. కేటీఆర్ దత్తత తీసుకుంటా అని చెప్పడం బ్రోకర్ మాటలని మండిపడ్డారు. డబ్బులు, మద్యంతో గెలవాలని కేసీఆర్ అనుకుంటున్నారని, అదంతా కలన్నారు. హుజూరాబాద్ ప్రజలు మోసపోయామని పెడుతున్న పోస్టర్లు లంగ దందా, రండగాళ్లు ఇలాంటి పనులు చేస్తారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.













