మహిళల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే : ఈటల
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్లో ఈటల మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే. 10 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం. మహిళలు, యువత అంతా కలిసి మోదీని మరోసారి గెలిపించుకోవాలనుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఎక్కడచూసినా కుంభకోణాలే. మోదీ నాయకత్వంలో ఎలాంటి మచ్చ లేకుండా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది అని అన్నారు.













