రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా.. హుజూరాబాద్ ఫలితమే : ఈటల
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ ఫలితమే పునరావృతం అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈటల మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ నాయకులే సీఎం కేసీఆర్ ప్రవర్తన సరిగా లేదని అసహించుకున్నారని అన్నారు. ప్రగతి భవన్ కేంద్రంగా జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలకు ఫుల్స్టాప్ పెట్టాలని కేటీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర, పంజాబ్, హరియాణాల్లో అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ చెప్పే మాటలకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.













