అవసరమైతేనే బయటకు రండి… : ఈటల రాజేందర్
అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకి రావొద్దని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందూ అత్యంత జాగరూకతతో ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా పరిస్థితిపై ఆయన వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. కేసులు పెరిగితే రోగులకు సరిపడా ఆస్పత్రులను సిద్ధం చేయాలని, గాంధీ ఆస్పత్రి కోవిడ్ వార్డుల్లో అన్ని ఏర్పాట్లూ చేయాలని ఆదేశించారు. పీపీఈ కిట్లు, మాస్కులు, ఔషదాలు అన్నింటినీ అందుబాటులో ఉంచాలని, రోజుకు 50 వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని, వీటి సంఖ్యను మరింత పెంచాలని ఈటల అధికారులను ఆదేశించారు.













